
కర్నూల్: కరోనా నుంచి తమ కుటుంబ సభ్యులు కోలుకొని, ఆరోగ్యంగానే ఉన్నారని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ తెలిపారు. సోమవారం కర్నూల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న ఆదోని వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా జిల్లాకు తీసుకురానున్నట్లు సంజీవ్‌కుమార్ వెల్లడించారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించి పరిష్కారించారని తెలిపారు. (కర్నూలులో 403 మంది కరోనా విజేతలు)
అదేవిధంగా కరోనా వైరస్ పట్ల కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల నీటి వాటాలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఇది మంచిది కాదని హితవు పలికారు. ఏపికి రావాల్సిన నీటిని కేటాయించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. జిల్లాలో విద్యుత్ చార్జీలపై ఉన్నతాధికారుల తో సమీక్షిస్తామని సంజీవ్ కుమార్ చెప్పారు. (వలస జీవులకు ఏపీ ప్రభుత్వం అండ)
Comments
Please login to add a commentAdd a comment