తిరుమలలో మంగళవారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడింది.
తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తులకు లడ్డూ ప్రసాదం సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడింది. లడ్డూల కోసం కేటాయించిన టోకెన్లు స్కాన్ అవ్వకపోవడంతో అధికారులు భక్తులకు లడ్డూలను ఇవ్వకుండా ఆపేశారు.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సర్వ దర్శనం భక్తులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు క్యూలైన్‌లో ఉన్న భక్తులందరికీ లడ్డూలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో భక్తులు ఆందోళన విరమించారు.