కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన దంగేటి ఏడుకొండలు అనే కౌలు రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.
యానాం టౌన్ :కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన దంగేటి ఏడుకొండలు అనే కౌలు రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఏడుకొండలు ముగ్గురు రైతుల నుంచి 20 ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటనష్టం రావడంతో కౌలు చెల్లించలేక గురువారం పట్టణంలోని ఓ సెల్ టవర్‌ఎక్కారు.
యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి గిడ్డి బలరామ్ వచ్చి ఏడుకొండలుకు ఫోన్ చేసి దిగి రావాలని కోరారు. అరుుతే రైతులు తనను కౌలు అడగబోమని హామీ ఇస్తేనే దిగుతానని, లేకపోతే దూకేస్తానని ఏడుకొండలు బెదిరించారు. చివరికి పరిపాలనాధికారి, అందుబాటులో ఉన్న ఓ రైతు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పాటు తనపై పోలీసు కేసు పెట్టబోమన్న హామీతో ఏడుకొండలు దిగివచ్చాడు.