
నిజాం కళాశాలలో.. ప్రజా సమస్యలపై 10న సభ
రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాలని నాలుగు వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. భావోద్వేగాలపై ఆధారపడి ఇతర సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని లెఫ్‌టపార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాలని నాలుగు వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. భావోద్వేగాలపై ఆధారపడి ఇతర సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని లెఫ్‌టపార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఈనెల 10న నిజాం కళాశాలలో నాలుగు వామపక్షాలు నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బీవీ రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర నేత కె.రామకృష్ణ, ఆర్‌ఎస్‌పీ నాయకుడు జానƒ కి రాములు, ఫార్వర్‌డ బ్లాక్ నాయకుడు సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా విలేకరులతో వారు మాట్లాడారు.బహిరంగ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, ఆర్‌ఎస్‌పీ నేత అబనీరాయ్, ఫ్వారర్‌డ బ్లాక్ నేత దేబబ్రత బిశ్వాస్‌లు పాల్గొంటారని కె.నారాయణ చెప్పారు. రాష్ట్ర, జాతీయ అంశాలను ఇందులో ప్రస్తావిస్తామన్నారు.పాలనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నిన్నటి వరకూ రాహుల్ గాంధీ బొమ్మ చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఆ పార్టీ చూసిందని, ప్రస్తుతం అది సాధ్యం కాదని తెలిసి ప్రియాంక గాంధీని తెరపైకి తెస్తోందన్నారు. బీజేపీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జపం చేయడం ద్వారా లబ్ధికి యత్నిస్తోందన్నారు. ఇక రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు, సోనియా గాంధీని ధిక్కరిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల సమ్మె వల్ల సీమాంధ్రలోని చౌకధరల దుకాణాల్లో సరుకులు ప్రజలకు అందడం లేదన్నారు. సమ్మె జరగని తెలంగాణ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్రలో ప్రవేట్ బస్సులు నడుస్తున్నాయని, కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, అది తీసివేస్తే ఊపిరి పోతుందన్నారు. .గతంలో జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాలు జరిగినపుడు కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.దసరా పండుగకు తెలంగాణ ప్రాంతంలోని ఆర్‌టీసీ కార్మికులకు మాత్రమే అడ్వాన్‌స ఇస్తామని,సమ్మెలో ఉన్నందు వల్ల సీమాంధ్ర ప్రాంతంలోని వారికి ఇవ్వబోమని సంస్థ యాజమాన్యం చెప్పడం సరికాదన్నారు. రాఘవులు మాట్లాడుతూ, భూ సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉపయోగించని భూములను తిరిగి సొంత దారులకు కేటాయించాలని,కౌలు రైతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని,