సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శివారు పంచాయతీలకు త్వరలో ‘పట్టణ’ హోదా రానుంది. నగరానికి చేరువలో ఉన్న 35 గ్రామ పంచాయతీలను ప్రతిపాదిత 12 పురపాలక సంఘాల పరిధిలోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయాలని ప్రతిపాదించిన ఈ పంచాయతీల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో ప్రభుత్వం.. గ్రేటర్‌లో కలిపే అంశంపై వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లి, కాల్వంచ గ్రామాలు మినహా.. మిగతావాటిని నగర పంచాయతీలు/ మున్సిపాలిటీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై పురపాలకశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం సంతకంచేసి ఆమోదం తెలిపారు. మున్సిపల్ శాఖలో విలీనం చేసుకుంటున్న గ్రామాలను డీనోటిఫై చేయాలని సూచిస్తూ పంచాయతీరాజ్‌శాఖకు ఫైలు పంపారు. అక్కడి నుంచి ఫైలు ముఖ్యమంత్రి వద్దకు చేరనుంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. శివారు పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.
కొత్త మున్సిపాలిటీలివే: శంషాబాద్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, కొంపల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, కొత్తపేట, జల్‌పల్లి, బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం
కొత్త మున్సిపాలిటీలకు లైన్ క్లియర్!
Published Mon, Jan 6 2014 11:16 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement