మారిన పాఠశాలల వేళలు | schools timings were changed | Sakshi
Sakshi News home page

మారిన పాఠశాలల వేళలు

Published Fri, Dec 19 2014 11:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

schools timings were  changed

జీహెచ్‌ఎంసీ పరిధిలో మారిన సమయపాలన
కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన డీఈఓ


పరిగి: రంగారెడ్డి జిల్లాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల యాజమాన్యాలు మారిన సమయపాలనను కచ్చితంగా పాటించాలని డీఈఓ రమేష్ ఓ ప్రకటనలో ఆదేశించారు. ఈ మేరకు సమయపాలనతో కూడిన ప్రకటనను ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. ప్రస్తుతం పాటిస్తున్న సమయపాలనకు బదులుగా ఈ కింద తెలిపిన సమయాన్ని పాటించాల్సిందేనని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9-00 గంటల నుంచి సాయంత్రం 4-00 గంటల వరకు నిర్వహిస్తుండగా ఇకమీద ఉదయం 8-45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.20 నిమిషాల వరకు కొనసాగించాలన్నారు.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉదయం 9-00 గంటల నుంచి 4-30 వరకు కొనసాగుతుండగా ఇకమీద ఉదయం 8-45 నుంచి సాయంత్రం 3-55 వరకు కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9-00 గంటల నుంచి సాయంత్రం 4-30 వరకు కొనసాగుతుండగా ఇకమీదట ఉదయం 8-45 గంటల నుంచి సాయంత్రం 3-55 గంటల వరకు కొనసాగించాలన్నారు. మారిన సమయ పాలన కచ్చితంగా అమలయ్యేట్లుగా ప్రధానోపాధ్యాయులు బాధ్యతవహించాలని చెప్పారు. ఈ సమయ పాలన కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లా పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement