గ్రామాన్ని వణికిస్తున్నదెయ్యం.. | ghost Threatening village | Sakshi
Sakshi News home page

గ్రామాన్ని వణికిస్తున్నదెయ్యం..

Published Fri, Feb 26 2016 12:00 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

గ్రామాన్ని వణికిస్తున్నదెయ్యం.. - Sakshi

గ్రామాన్ని వణికిస్తున్నదెయ్యం..

దెయ్యం భయం ఆ గ్రామస్తులను పట్టి పీడిస్తోంది. మూడు రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వెంకటరమణ కాలనీలో ఈ పరిస్థితి నెలకొంది. వారం క్రితం కాలనీకి చెందిన ఓ గర్భిణి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె దెయ్యంగా మారి గ్రామంలో తిరుగుతోందంటూ ప్రచారం మొదలైంది. ఈ భయంతో కాలనీ వాసులు వణికిపోతున్నారు. ఏక్షణం  ఏమవుతుందో అంటూ భయపడుతున్నారు.


విషయం తెలిసిన జన విజ్ఞాన వేదిక వాళ్లు అక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ ఆ కాలనీకి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. దెయ్యాలు, భూతాలు లేవని, అవన్నీ మన అనుమానాలేనని వారికి ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement