సాక్షి, గుంటూరు: జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ.. మహిళలకు సముచిత స్థానం కల్పించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన నందిగం సురేష్‌వంటి వారికి పార్లమెంట్ స్థానం కేటాయించి తమ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందనే సంకేతాన్ని పంపింది. బీసీలను చట్టసభల్లో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఆ సామాజిక వర్గ నేతలను మూడు స్థానాల్లో పోటీలో నిలిపింది. ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల బరిలో నిలిచింది. ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలతో, నవరత్నాల వంటి పథకాలతో ముందుకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను మనసారా అశీర్వదించాలని జిల్లా వాసులను వినమ్రంగా శిరస్సువంచివేడుకుంటోంది.
మాచర్ల
అభ్యర్థి పేరు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (48)
తల్లిదండ్రులు : పిన్నెల్లి వెంకటేశ్వరరెడ్డి, రాములమ్మ
భార్య : రమాదేవి
కుమారుడు : వీరాంజనేయ గౌతమ్‌రెడ్డి
కుమార్తె : సంయుక్త
ఊరు : కండ్లకుంట (వెల్దుర్తి మండలం)
విద్యార్హత : బీకాం
వృత్తి : వ్యాపారం
నేపథ్యం: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. 1996లో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రత్తిపాడు (ఎస్సీ)
అభ్యర్థి పేరు : మేకతోటి సుచరిత
భర్త : మేకతోటి దయాసాగర్ (ఐఆర్‌ఎస్)
కుమారుడు : హర్షిత్
కుమార్తె : రితిక
విద్యార్హత : ఎంఏ లిటరేచర్, బీఏ పొలిటికల్ సైన్స్
ఊరు : ఫిరంగిపురం
నేపథ్యం: మేకతోటి సుచరిత ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తదనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశీస్సులతో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం కైవసం చేసుకున్నారు. వైఎస్ మరణానంతరం 2012లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 16,781 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
గురజాల
అభ్యర్థి పేరు : కాసు మహేష్‌రెడ్డి (43)
తల్లిదండ్రులు : కాసు వెంకట కృష్ణారెడ్డి, సంధ్యా
భార్య : షామిలీ
కుమార్తె : హాసిని
విద్యార్హత : ఎల్‌ఎల్‌బీ
ఊరు : నరసరావుపేట
నేపథ్యం: కాసు మహేష్‌రెడ్డి కుటుంబానికి పల్నాడు ప్రాంతంతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాసు మహేష్‌రెడ్డి తాత కాసు బ్రహ్మానందారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు ప్రాంతంలో నీటి ఎద్దడిని గమనించి వెంటనే నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పలువురు ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వహించారు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా ప్రజా సేవను ఎంచుకున్న మహేష్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేశారు.
సత్తెనపల్లి
అభ్యర్థి పేరు : అంబటి రాంబాబు
తల్లిదండ్రులు : ఏవీ ఎస్‌ఆర్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ
భార్య : విజయలక్ష్మీ
కుమార్తెలు: మౌనిక, మనోజ్ఞ, శ్రీజ
విద్యార్హత : బీఏ, బీఎల్
ఊరు : రేపల్లె
నేపథ్యం: అంబటి రాంబాబు 1988లో జిల్లా కాంగ్రెస్‌పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, 1989లో రేపల్లె శాసనసభ్యుడిగా, 1994 లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ (నెడ్‌క్యాప్)గా చేశారు. 1989 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ (పీఏసీ)తో పాటు పలు హోదాల్లో కొనసాగారు. ఆయనకు మంచి వక్తగా పేరుంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో 924 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
బాపట్ల
అభ్యర్థిపేరు : కోన రఘుపతి
తల్లిదండ్రులు : కోన ప్రభాకర్‌రావు (మాజీ
గవర్నర్), పద్మావతి
భార్య : రమాదేవి
కుమారుడు : నిఖిల్
కుమార్తె : నీరజ
(ఫ్యాషన్ డిజైనర్)
వృత్తి : రాజకీయ నాయకుడు
విద్యార్హత : బి.కామ్
గ్రామం : బాపట్ల
నేపథ్యం: కోన కుటుంబం తొలి నుంచి రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి వరుసగా మూడు సార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే రఘుపతి 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 30వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోన, టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్‌ప్రభాకర్‌పై 5813ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించారు.
వినుకొండ
అభ్యర్థి పేరు : బొల్లా బ్రహ్మనాయుడు
తల్లిదండ్రులు : హనుమయ్య, మాణిక్యమ్మ
భార్య : ఆదిలక్ష్మి , మాజీ సర్పంచ్, వేల్పూరు
కుమార్తె : పోట్ల మణికుమారి
కుమారుడు : శ్రీనివాసరావు, (వ్యాపారవేత్త), గిరిబాబు (వ్యాపారవేత్త)
గ్రామం : వేల్పూరు, శావల్యాపురం మండలం
వృత్తి : వ్యాపార వేత్త
నేపథ్యం: సామాన్య వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన బొల్లా 2004 తిరుమల డెయిరీని స్థాపించారు. తిరుమల ఇంజినీరింగ్ కళాశాల, తిరుమల ఆక్స్‌ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట విద్యాసంస్థలను నెలకొల్పారు. 2009లో బొల్లా ప్రజారాజ్యం తరఫున వినుకొండలో, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరి 2014లో పెదకూరపాడులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మేజార్టీ తేడాతో ఓడిపోయారు.
వేమూరు (ఎస్సీ)
అభ్యర్థి పేరు : డాక్టర్ మేరుగ నాగార్జున (53)
తల్లిదండ్రులు : మేరుగ కోటేశ్వరరావు, వీరమ్మ
భార్య : కంభం నాగమణి
కుమారుడు : మేరుగ కిరణ్‌నాగ్ (పీహెచ్‌డీ), మేరుగ చందన్‌నాగ్ (ఎంబీబీఎస్)
కుమార్తె : మౌనికానాగ్ (ఎం.టెక్)
ఊరు : వెల్లటూరు (భట్టిప్రోలు మండలం)
విద్యార్హత : ఎం.కామ్, ఎం.ఫిల్, పీహెచ్‌డీ
వృత్తి : ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ (మాజీ)
నేపథ్యం: ఆంధ్రా వర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలుపు మేరకు 2004 ఏడాదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పని చేశారు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ తరుఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment