
మల్లెంకొండ అడవుల్లో ఎర్రచందనం డంప్
సోమశిల: పోలీసులు, అటవీశాఖ అధికారుల మధ్య వివాదానికి కేంద్రబిందువైన మల్లెంకొండ అడవుల్లో ఎట్టకేలకు ఎర్రచందనం దుంగల డంప్ బయటపడింది.
సోమశిల: పోలీసులు, అటవీశాఖ అధికారుల మధ్య వివాదానికి కేంద్రబిందువైన మల్లెంకొండ అడవుల్లో ఎట్టకేలకు ఎర్రచందనం దుంగల డంప్ బయటపడిం ది. ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేయడం తో పాటు రూ.25 లక్షల విలువైన 78 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ త్మకూరు ఇన్‌చార్జి డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి వెల్లడించారు. అనంతసాగరం పో లీసుస్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంథిల్‌కుమార్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
అందులో భాగంగా ఇటీవల అనంతసాగరంలోని పెట్రోలు బంక్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న టాటా మేజిక్ వాహనంలోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని విచారించగా ఎర్రచందనం దుంగల రవాణా కు వచ్చినట్లు తెలిసిందన్నారు. విచారణలో వారిచ్చిన సమాచారంతో మల్లెం కొండ అడవుల్లోని నాగమల్లేశ్వర ఆల యానికి కిలోమీటర్ దూరంలో మంగళవారం 78 దుంగల డంప్ బయటపడిం దన్నారు. వీటి విలువ రూ.25 లక్షలుగా అంచనా వేశామని చెప్పారు. ఈ దుంగలకు సంబంధించి ఆత్మకూరు మండలం బండారుపల్లికి చెందిన నంబూరి శివ య్య, దగదర్తికి చెందిన బొల్లా అనిల్, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన రామతోటి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశామని వివరించారు.
డంప్ కోసం గాలిస్తున్న సమయంలోనే పోలీసులపై ఫారెస్ట్ బేస్‌క్యాం ప్ సిబ్బంది దాడి చేశారన్నారు. ఇక్కడి నుంచి చెన్నై తదితర ప్రాంతాలకు కొంతకాలంగా దుంగల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఈ అక్రమ రవాణా విషయంలో అటవీశాఖ సిబ్బందిలోని కొందరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏ శాఖ ఉద్యోగి అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం ముగ్గురు స్మగ్లర్లను ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ వెంట ఆత్మకూరు సీఐ అల్తాఫ్‌హుస్సేన్, ఎస్సైలు పుల్లారావు, అంకమ్మ తదితరులు ఉన్నారు.
dal dump, forest officials