దొనకొండ మండలం రాగముక్కపల్లి రైల్వేగేటు వద్ద ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం(దొనకొండ): దొనకొండ మండలం రాగముక్కపల్లి రైల్వేగేటు వద్ద ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పైడిపోగు లక్ష్మయ్య(53)గా గుర్తించారు. కుటుంబసభ్యులతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.