డ్రైవర్ నిర్లక్ష్యంతో టిప్పర్ ఢీకొని కంకర క్వారీలో పని చేసే కార్మికుడు మృతి చెందాడు.
కల్లూరు (కర్నూలు జిల్లా) : డ్రైవర్ నిర్లక్ష్యంతో టిప్పర్ ఢీకొని కంకర క్వారీలో పని చేసే కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలోని క్వారీలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల ప్రకారం..మల్లయ్య(50) అనే కార్మికుడు నాయకల్లు గ్రామంలోని కంకర క్వారీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి పని చేస్తుండగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో దాని కింద పడి మల్లయ్య మృతి చెందాడు.
మల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. క్వారీ యాజమాన్యం మల్లయ్య బంధువులకు సోమవారం సమాచారం అందించారు. దీంతో మల్లయ్య కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.