'వైఎస్ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు'
హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డే ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు తలెత్తేవే కావని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అభిప్రాయపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. విభజన ప్రకటనతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు విజయమ్మ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ప్రధానిని కలిశారు.
భేటీ అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ న్యాయం చేయలేకపోతే రాష్ట్ర విభజన చేయరాదన్న తమ డిమాండ్‌ను పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయ్యారు.