కరోనా రూటు మార్చి ఏమారుస్తోంది..! | Many new symptoms to Covid-19 Patients | Sakshi
Sakshi News home page

కరోనా రూటు మార్చి ఏమారుస్తోంది..!

Published Wed, Jul 8 2020 3:59 AM | Last Updated on Wed, Jul 8 2020 7:49 AM

Many new symptoms to Covid-19 Patients - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ రూటు మార్చింది. ఎవరూ అంచనా వేయని విధంగా కొత్త దార్లలో వెళుతోంది. వైరస్‌ వ్యాపిస్తోన్న కొద్దీ పాజిటివ్‌ పేషెంట్లలో పలు రకాల లక్షణాలు బయటికొస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గడిచిన పక్షం రోజులుగా కొత్తరకం కరోనా లక్షణాలు బయటికొస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిర్ధారించిన వాటికి భిన్నంగా ఏ లక్షణాలుంటే కరోనా పాజిటివ్‌ అనుకోవాలో అర్థం కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కొందరికి ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉండటం, మరికొందరిలో లక్షణాలున్నా నెగిటివ్‌ రావడం చోటుచేసుకుంటోంది. తాజా పరిస్థితులను అంచనా వేసి, వాటికి పరిష్కార మార్గాలు కనుగొనడంలో డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ మరింతగా కసరత్తు చేస్తున్నాయి. 

ప్రస్తుతం కరోనా లక్షణాలు ఇలా..
► కడుపులో వికారంగా ఉండటం 
► విపరీతంగా నీళ్ల విరేచనాలు  
► రోజులో ఐదారుసార్లు పైనే వాంతులు  
► కడుపు ఉబ్బరం
► ఆహారం అరగకపోవడం 
► చర్మంపై దద్దుర్లు... ఇవి రోజు రోజుకూ తీవ్రమవడం హా అరికాళ్లలో తిమ్మిర్లు
► మూర్ఛ, నత్తిగా మాట్లాడటం.. 

కొత్త లక్షణాలకు వైద్యుల సూచనలు: 
► ఆకుకూరలు, కూరగాయల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం 
► ఎక్కువగా మంచినీళ్లు తాగడం..పళ్లను తీసుకోవడం.. యోగా లేదా ప్రాణాయామం చేయడం 
► టాయ్‌లెట్‌లను వైరస్‌ను నియంత్రించే రసాయనాలతో శుభ్రం చేయడం 
► ఇంట్లో రెండు లేదా మూడు టాయ్‌లెట్‌లు ఉంటే కొంతమంది లెక్కన వాటిని వాడటం.

ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఇలా... 
► దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేక పోవడం.. 
► కళ్లలో తేడాలుంటే పాజిటివ్‌గా నిర్ధారణ చేసుకోవడం 
► శరీరం బలహీనంగా అనిపించడం, అలసట.. గొంతు తడారినట్టుగా ఉండి, విపరీతంగా పొడిదగ్గు.. ఊపిరితిత్తుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం 
► శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ శాతాన్ని కుచించుకుపోయేలా చేయడం 
► కొంతమందిలో ఇన్ఫెక్షన్‌ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం

డయేరియా లక్షణాలు
తాజాగా అరిచేతులు అరికాళ్లు తిమ్మిర్లుగా ఉండటం, ఫిట్స్‌ రావడం, నత్తిగా మాట్లాడటం వంటివి ఈ లక్షణాల్లో చేర్చారు. గత కొద్ది రోజులుగా పాజిటివ్‌ పేషెంట్లలో డయేరియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత శుభ్రతలే దీనికి చికిత్సగా చెప్పుకోవాలి. 
– డా.రాంబాబు, నోడల్‌ అధికారి, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, విజయవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement