రహదారులపై గుంతలు కనిపించాయా?... నిండిపోయినా కుండీ నుంచి చెత్తను తొలగించలేదా?... వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్నారా?...
ఫిర్యాదుల స్వీకరణకు జీహెచ్ ఎంసీ కొత్త విధానం
మైక్రోసాఫ్ట్ సహకారంతో కొత్త యాప్
హైదరాబాద్: రహదారులపై గుంతలు కనిపించాయా?... నిండిపోయినా కుండీ నుంచి చెత్తను తొలగించలేదా?... వీధి కుక్కలతో బెంబేలెత్తుతున్నారా?... ఇలా సమస్య ఏదైనా మీ దృష్టికి వస్తే యాప్ ఆన్ చేసి స్మార్ట్ ఫోన్‌తో ‘క్లిక్’ మనిపించండి. దాన్ని ‘సేవ్’ చేసి వచ్చే ఆప్షన్ల నుంచి ‘సెండ్’ కొట్టండి. అంతే.. ఆ సమస్య జీహెచ్‌ఎంసీ ఫిర్యాదుల కాల్‌సెంటర్‌కు చేరుతుంది. వెంటనే దాన్ని పరిష్కరించే సంబంధిత అధికారికి ఫిర్యాదు సెంటర్ నుంచి సందేశాలు వెళ్తాయి. వారు ఆ సమస్యను పరిష్కరిస్తారు.
వినూత్న తరహాలో ఫిర్యాదులను స్వీకరించే ఈ సరికొత్త విధానాన్ని జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తేనుంది. ‘సిటి ..జెన్’గా వ్యవహరించే ఈ పథకాన్ని మైక్రోసాఫ్ట్ సహకారంతో రూపొందించిన యాప్‌తో అమల్లోకి తీసుకురానుంది. ఈనెల 22న దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ ఉచితంగానే అందజేస్తుందన్నారు. ఒక్క ఫొటోతోనే సదరు సమస్య ఎక్కడుందో.. ఏ ప్రదేశంలోదో కూడా జీపీఎస్ ద్వారా తెలిసిపోతుందన్నారు.