మిర్యాలగూడ, న్యూస్‌లైన్ :ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి విద్యాశాఖ ప్ర ణాళిక రూపొందించింది. ఇందుకోసం మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలను నియమించి నిఘా ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీల తగాదాలకు చెక్ పెట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడమే ఈ విజిలెన్స్, మా నిటరింగ్ కమిటీ ముఖ్య ఉద్దేశం. జిల్లా వ్యాప్తంగా 3301 ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా మధ్యా హ్న భోజనాన్ని 3.16 లక్షల మంది విద్యార్థులు ఆరగిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.3. 45, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అం దడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి మధ్యాహ్నభోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయనున్నారు.
ఇవీ కమిటీలు
జిల్లాలోని అన్ని మండలాల్లో ముగ్గురితో కూడిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలో మండల విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారి, ఈఓఆర్డీలు ఉన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కమిటీకి చైర్మన్‌గా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభ్యులుగా జిల్లా కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా విద్యాశాఖాధికారి ఉంటారు.
మానిటరింగ్ చేసేది ఇలా..
మండల స్థాయిలో కమిటీలో పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సూచనలు మేరకు భోజనం, కూరలు వండి పెట్టడంతో పాటు నాణ్యతగా ఉండేలా చూస్తారు. కమిటీలతో పాటు మండల విద్యాధికారి ప్రత్యేకంగా ప్రతి రోజు రెండు పాఠశాలలను సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించాలి. ఏ రోజుకు ఆరోజు మండలంలోని మధ్యా హ్న భోజనం పరిస్థితిపై జిల్లా విద్యాధికారికి నివేదిక అందజేయాలి. అదే విధంగా జిల్లా స్థాయిలో వచ్చిన వివరాల ఆధారంగా వారంలో ప్రతి శుక్రవారం విద్యాశాఖ డెరైక్టర్‌కు జిల్లాకు సంబంధించిన వివరాలపై డీఈఓ నివేదిక అందజేయాలి.
మధ్యాహ్న భోజనంపై నిఘా
Published Thu, Sep 26 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement