
సాక్షి, అమరావతి: ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని.. హైదరాబాద్‌లో ఉండి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని పేర్కొన్నారు.
(ఓర్వలేకే కుటిల రాజకీయాలు: ఆళ్ల నాని)
రాష్ట్రంలో 20 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ర్యాపిడ్ టెస్ట్ చేసి ఫలితాలను కూడా త్వరగా అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. కొందరు వ్యక్తులు పనికట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేస్తున్నామని బుగ్గన రాజేంద్రనాధ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment