'సాక్షి' కథనానికి పరిటాల సునీత స్పందన | Minister paritala sunitha respond on sakshi tv suribabu Rythu bazaar programme | Sakshi
Sakshi News home page

'సాక్షి' కథనానికి పరిటాల సునీత స్పందన

Published Sat, Sep 13 2014 11:42 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'సాక్షి' కథనానికి పరిటాల సునీత స్పందన - Sakshi

'సాక్షి' కథనానికి పరిటాల సునీత స్పందన

కాకినాడ : తుని మార్కెట్‌ యార్డ్‌లో బినామీ పేర్లతో టీడీపీ నేతల షాపులకు సంబంధించి  సాక్షి టీవీ కథనానికి పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు. రైతు బజార్లలో అక్రమాలపై చర్యలు తీసుకుంటామని ఆమె శనివారమిక్కడ అన్నారు. దళారులు చేతుల్లో ఉన్న షాపులను తిరిగి రైతులకు అప్పగిస్తామని పరిటాల సునీత తెలిపారు.

 

తుని మార్కెట్లో జరిగిన అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, దీనిపై విచారణ జరిపిస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు తునిలో తెలుగు తమ్ముళ్లు రైతు బజార్లను కూడా వదిలి పెట్టలేదు. ఏకంగా రైతు బజారుకు 'రాపేటి సూరిబాబు రైతు బజారు' అని బోర్డు పెట్టి మరీ తమ దందా సాగించటం విశేషం. దీనిపై సాక్షి టీవీ ఓ కథనం ప్రసారం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement