మైనారిటీ వర్గాల విద్యాప్రదాత రసూల్ ఖాన్ కన్నుమూత | Minority communities educationist Mohammed Rasool Khan Passed away | Sakshi
Sakshi News home page

మైనారిటీ వర్గాల విద్యాప్రదాత రసూల్ ఖాన్ కన్నుమూత

Published Tue, Oct 22 2013 5:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మైనారిటీ వర్గాల విద్యాప్రదాత రసూల్ ఖాన్ కన్నుమూత - Sakshi

మైనారిటీ వర్గాల విద్యాప్రదాత రసూల్ ఖాన్ కన్నుమూత

హైదరాబాద్, సాక్షి: మైనారిటీ వర్గాల ప్రజల విద్యాభివృద్ధి కోసం ఆహర్నిశలూ కృషి చేసిన విద్యా ప్రదాత  డాక్టర్ మహమ్మద్ విజారత్ రసూల్ ఖాన్ (66) సోవువారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న రసూల్ ఖాన్ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. 1947 డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జన్మించిన రసూల్ ఖాన్ బాల్యం. హైదరాబాద్‌లోనే గడిచింది. గన్‌ఫౌండ్రిలోని ఆలియా స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించి, 1970 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్‌గా పట్టభద్రులయ్యారు. సికింద్రబాద్‌లోని అసుపత్రిలో వైద్య వృత్తిని సాగించారు. 1984ఉప ఎన్నికల్లో ఒకసారి,1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో  ఆసిఫ్‌నగర్ నుంచి రెండుసార్లు శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఆయన 1998 లో షాదాన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. దేశంలో కేజీ నుంచి పీజీ స్థాయివరకూ విద్యా సంస్థలను స్థాపించిన ఘనత విజారత్ రసూల్ ఖాన్‌కే దక్కింది. దేశంలోనే మొదటి మహిళా మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు.
 
 ఆయన 18 ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కళాశాలలు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు స్థాపించారు. మంగళవారం మధ్యాహ్నం  ఖైరతాబాద్‌లోని షాదాన్ మసీదులో మధ్యాహ్నం ఒకటిన్నరకు జనాజా నమాజు అనంతరం ఆయున అంత్యక్రియలు జరుగుతాయి. హిమాయత్ సాగర్ రోడ్డులోని షాదాన్ హస్పిటల్ ఆవరణలో రసూల్ ఖాన్ భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. రసూల్ ఖాన్ మృతిపట్ల పలువురు రాజకీయు నాయుకులు అక్బరుద్దీన్ ఒవైసీ, మోజమ్ ఖాన్, అఫ్సర్ ఖాన్, షబ్బీర్ అలీ, అహ్మద్ బలాలా, జాహెద్ అలీ ఖాన్, పలు విద్యా సంస్థలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఉలేమాలు, ముప్తీలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement