
'చంద్రబాబుది నయ వంచన దీక్ష'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్‌లో చంద్రబాబు ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్ష.. నయవంచన దీక్ష అంటూ మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది చంద్రబాబు పాలనంతా ఆత్మస్తుతి పరనిందలా సాగిందని దుయ్యబట్టారు. చంద్రబాబుది ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణి' అంటూ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఏడాదిలో ఒక్క హామీ కూడా అమలు చేయలేక పోయారని ఎంపీ మిథున్రెడ్డి విమర్శించారు.