విజయనగరం (బొబ్బిలి) : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు అన్నారు. ఆయన బొబ్బిలిలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేదని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రిగా అపారమైన అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడలంలో విఫలమయ్యారని తెలిపారు. అయితే ఆయన ప్రత్యేక హోదా రాకపోవడానికి గల కారణాలు తెలపడంలో సఫలమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయల కల్పనకు నిధులు కేటాయించని ప్రభుత్వం.... మంత్రుల విదేశీ పర్యటనలకు మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన అధికార పక్షంపై మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి తరపున పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం
Published Mon, May 18 2015 3:49 PM | Last Updated on Tue, Oct 30 2018 5:23 PM
Advertisement
Advertisement