శివ్వంపేట, న్యూస్‌లైన్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శివ్వంపేట, సికింద్లాపూర్, పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాల్లో ఆమె పర్యటించారు. సికింద్లాపూర్, లింగోజిగూడలో సీసీ రోడ్లు, లింగోజిగూడ తండాలో పాఠశాల భవనం, పిల్లుట్లలో ఆరోగ్య ఉపకేంద్రం, శివ్వంపేట శ్రీరాంనగర్ కాలనీలో పాఠశాల భవనం, తూప్రాన్ - నర్సాపూర్ ప్రధాన రహదారి వద్ద రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంతర్గత రోడ్లు, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు కృషిచేయడంతో ప్రతి కుటుంబానికి సంక్షేమపథకాలు అందిస్తున్నామన్నారు.
విద్యుత్ కొరతను అధిగమించేందుకు గాను సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి పంచాయతీ పరిధిలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకధికారి బాల్‌రెడ్డి, తహశీల్దార్ కిష్టారెడ్డి, ఎంపీడీఓ పూజ, సర్పంచ్‌లు చంద్రాగౌడ్, సులోచన నర్సింహారెడ్డి, స్రవంతి నవీన్‌కుమార్, పన్సారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతారావు, గోలి వెంకటేశం గుప్తా, చింతల మహేందర్‌రెడ్డి, యాదాగౌడ్, నాయకులు రాజలింగం, బాసన్‌పల్లి రాములుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నాగభూషణం, మహిపాల్‌రెడ్డి, చింతస్వామి, తదితరులు పాల్గొన్నారు.
15 ఏళ్ల తర్వాత బస్కెక్కా
మంత్రి సునీతారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పిల్లుట్ల నుంచి నర్సాపూర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం మంత్రి బస్సులో పిల్లుట్ల నుంచి లింగోజిగూడ వరకు టిక్కెట్టు తీసుకొని ప్రయాణం చేశారు. 15ఏళ్ల తర్వాత తాను బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సులోచన నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత మంత్రి సునీతారెడ్డి
Published Wed, Oct 9 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement