తిరుపతిలో..
సాక్షి నెట్‌వర్క్: అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా గురువారం రాష్ట్రంలో పోస్టుకార్డుల ఉద్యమం జరిగింది. వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, యువత తదితరులు అధికార వికేంద్రీకరణకు, మూడు రాజధానులకు మద్దతుగా రాసిన పోస్టుకార్డులను రాష్ట్రపతికి పంపారు. అనంతపురం నగరపాలక సంస్థ ఎదుట వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపే కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు.. మంత్రి శంకర్‌నారాయణతో కలిసి ప్రారంభించారు. ఐదు వేల మంది విద్యార్థులు, మహిళలు, యువత, న్యాయవాదులు వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రపతికి పోస్టుకార్డులు రాశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాయలసీమలో పుట్టిన చంద్రబాబు రాయలసీమకే అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయచోటిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మోక్షిత్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణపై టీడీపీ తీరును నిరసిస్తూ రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. పాలన వికేంద్రీకరణపై అసెంబ్లీ, మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. అలాగే వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ఖాజా రహమతుల్లా ఆధ్వర్యంలో కడపలోని హెడ్ పోస్టాఫీసు ఎదుట పోçస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు.
విశాఖలో..
డిప్యూటీ సీఎం సోదరుడు ఎస్‌బీ అహ్మద్‌బాషా ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రపతికి పోస్టు కార్డులను పంపారు. చిత్తూరు జిల్లాలో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఎస్వీయూ ఎంబీఏ భవనం వద్ద వైఎస్సార్ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏర్పేడు మండలంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు రాజీనామా చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నగర టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వారి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
వైఎస్సార్‌సీపీ విశాఖ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్ నుంచి నగర టీడీపీ ప్రధాన కార్యాలయం వరకు వారు కాగడాలతో ర్యాలీగా వచ్చారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. గుంటూరు బ్రాడీపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో, విజయనగరంలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువత వికేంద్రీకరణ కోరుతూ రాష్ట్రపతికి పోస్టుకార్డులు రాసి పోస్టుబాక్సుల్లో వేశారు. రామచంద్రపురం పట్టణంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో, పి.గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు ఆధ్వ ర్యంలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు.
గుంటూరులో..
ఆర్‌యూలో సంతకాల సేకరణ
కర్నూలు కల్చరల్: కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం(ఆర్‌యూ)లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థులు, బోధన, బోధనేతర ఉద్యోగులు అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటసుందరానంద్, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహులు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావ్ తదితరులు పాల్గొని సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment