వైఎస్సార్‌ సీపీలోకి నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి | nandyal ex mla sanjeevareddy joins ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Published Sat, Jul 22 2017 2:06 AM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

nandyal ex mla sanjeevareddy joins ysrcp

 
 
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్‌
 
సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎం.సంజీవరెడ్డి ఆయన తనయుడు వెంకటరెడ్డితో కలసి శుక్రవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. సంజీవరెడ్డి హైదరాబాద్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్ల డించారు. జగన్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

నంద్యాలలో ప్రముఖ న్యాయవాది శివశంకర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. వీరి చేరికలో నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో సంజీ వరెడ్డి.. దివంగత భూమా నాగిరెడ్డికి మద్దతునిచ్చారు. పార్టీలో చేరిన అనంతరం జగన్‌ నివాసం వద్ద  సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఓటర్లను ప్రభావితం చేయడానికి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement