న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ శక్తి సామర్థ్యాలు ఉన్న బీసీ నాయకుడని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటిస్తే బీసీలంతా ఆయన వెంటే ఉంటారని కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కృష్ణయ్య కోరారు.
పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.