
వైఎస్ జగన్ ను కలసిన ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కలిశారు.
బుధవారం లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో కలసిన కృష్ణయ్య.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోరారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నానని.. అందులో భాగంగా వైఎస్ జగన్ ను కలిసినట్లు కృష్ణయ్య తెలిపారు.