
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం జీరో అవర్లో టీడీపీ ఎమ్మెల్యే కొమ్ములపాటి శ్రీధర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి కర్టెన్ ఇనుప రాడ్ జారి పడింది. ఎమ్మెల్యేలకు కొద్ది దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు శాసనసభ్యులు కంగారుపడ్డారు. అనంతరం మార్షల్స్ ...ఆ ఇనుపరాడ్ను తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.