'104' మధ్యలోనే ఆగిపోతున్నాయి | siva rama raju discussion on 104 in ap assembly | Sakshi
Sakshi News home page

'104' మధ్యలోనే ఆగిపోతున్నాయి

Published Wed, Mar 16 2016 12:09 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

siva rama raju discussion on 104 in ap assembly

హైదరాబాద్ : 104  వాహనాల సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు బుధవారం అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆరోపించారు. సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందని చెప్పారు. మందల పంపిణీ కూడా పూర్తీగా జరగడం లేదంటూ సభకు వివరించారు. 30 ట్యాబ్లెట్లు అవసరమైతే ... 10 ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమని చెబుతున్నారని సోదాహరణగా తెలిపారు.

104 వాహనాల్లో బీపీ, షుగర్, ఆస్తమాకు మందులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 104 వాహనాలకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement