జస్టిస్ నౌషాద్ అలీకి హైకోర్టు ఘన వీడ్కోలు | Naushad Ali, a solid farewell to the High Court of Justice | Sakshi
Sakshi News home page

జస్టిస్ నౌషాద్ అలీకి హైకోర్టు ఘన వీడ్కోలు

Published Sat, Mar 8 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

జస్టిస్ నౌషాద్ అలీకి హైకోర్టు ఘన వీడ్కోలు

జస్టిస్ నౌషాద్ అలీకి హైకోర్టు ఘన వీడ్కోలు

సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఆయనకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారికంగా జస్టిస్ అలీ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారం హైకోర్టుకు సెలవు కావడంతో శుక్రవారమే ఆయనకు హైకోర్టు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.
 
 ఈ కార్యక్రమంలో జస్టిస్ అలీ కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసి క్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధరరావు ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం జస్టిస్ అలీని ఘనంగా సన్మానించింది. జస్టిస్ అలీ 1952, మార్చి 8న చిత్తూరు జిల్లా పీలేరులో జన్మించారు. 1976లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2010, నవంబర్ 26న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement