
మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకుంటే...
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అందుకోసం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కొత్తగా చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో కొల్లు రవీంద్ర విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 730 మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాలేదని చెప్పారు. వాటి కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. అప్పుడు కూడా దరఖాస్తులు రాకుంటే ప్రభుత్వమే ఆ దుకాణాలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు కొల్లు రవీంద్ర వెల్లడించారు.