గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్ | Nigerian cannabis captured | Sakshi
Sakshi News home page

గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్

May 15 2016 5:43 AM | Updated on Sep 4 2017 12:06 AM

గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్

గంజాయితో పట్టుబడ్డ నైజీరియన్

గంజాయి తరలిస్తూ నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ద్వారకానగర్ పోలీసులు తెలిపిన వివరాల....

విశాఖపట్నం : గంజాయి తరలిస్తూ నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ద్వారకానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన ఇకెచుకువా ఆగస్టీన్(23) అరకులో గంజాయి కొనుగోలు చేసి ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు దిగాడు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్‌కు నడిచివెళ్తున్నాడు. సీటీఎఫ్ పోలీసులు, ద్వారకా పోలీసులు కలసి  అతడిని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రెండు బ్యాగులు తనిఖీ చేయగా 30 కేజీల బరువైన 15 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. సరకుతో పాటు అర్బన్ ఎమ్మార్వో ఎదుట హాజరు పరిచారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement