
సిడబ్ల్యూసి వెనక్కి తగ్గదు: జెడి శీలం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో సిడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదని కేంద్ర మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. ముందుకెళ్ళే క్రమంలో సమస్యలు పరిష్కరించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మె విరమించాలని ఆయన కోరారు.
హైదరాబాద్ సమస్యను పరిష్కరిస్తే ఉద్యమ తీవ్రత తగ్గుతుందని జేడీ శీలం అభిప్రాయపడ్డారు.