సాక్షి, మంచిర్యాల : పార్లమెంట్‌లో రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ జిల్లావాసులకు మళ్లీ నిరాశ కలిగించింది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నా కేంద్ర రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కొత్త లైన్ల ప్రస్తావన, లైన్ల నిర్మా ణం, రైళ్ల నిలుపుదల విషయంలో స్థానికులు రైల్వే జీఎం, ఎంపీలకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదు. కేవలం మంచి ర్యాల మీదుగా కొత్తగూడెం-పాట్నాకు ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్రం మంజూరు చేసి
చేతులు దులుపుకుంది. అయితే ఈ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఉంటుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కలగానే ప్రతిపాదనలు
2010-11బడ్జెట్ సమావేశాల్లోనే ఆదిలాబాద్ నుం చి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా ఆదిలాబాద్-పటాన్‌చెరు రైల్వేలైను నిర్మాణానికి నిధులు మంజూరై పనుల సర్వే కూడా పూర్తయిం ది. ఈ బడ్జెట్‌లో మార్గం ప్రస్తావన లేదు. దీంతో పశ్చిమ జిల్లావాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోం ది. ఇటు సుదూర తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపేందుకు గత పార్లమెంటు బడ్జెట్‌లో మంచి ర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించారు. కేంద్రం బడ్జెట్‌లో ఈ మార్గాన్ని విస్మరించింది.
గత బడ్జెట్‌లో మైసూర్-హౌరా వయా గోండియా, ఆదిలాబాద్ మీదుగా రైలును మం జూరు చేసి చివరకు మరో మార్గానికి మళ్లించారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా కేంద్రం కనికరిస్తుందనుకుంటే ఖర్గే అసలు ఈ మార్గం ప్రస్తావనే తేలేదు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో డిస్పెన్సరీ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆదిలాబాద్, బాసర స్టేషన్లలో జనరల్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఈసారి కూడా బడ్జెట్‌లో చోటు దక్కలేదు. జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గఢ్‌చందూర్‌కు రైల్వే మార్గం కోరిక కలగానే మిగిలింది. ఇటు రైల్వేలైన్ల పొడిగింపు.. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన... రైళ్ల హాల్టింగ్స్ విషయాన్ని ఖర్గే పూర్తిగా విస్మరించారు.
ఎంపీల వైఫల్యం
దేశవ్యాప్తంగా 72 కొత్త రైళ్లను బడ్జెట్‌లో పొందుపర్చినా అందులో జిల్లాకు సంబంధించిన రైలు ఒక్క టి లేకపోవడం మన ఎంపీలు రాథోడ్ రమేశ్, జి. వివేక్‌ల వైఫల్యానికి అద్దం పడుతోంది. జిల్లాకు చెందిన ప్రతిపాదనలు పంపి వాటిని మంజూరు చేయించడంలో విఫలమయ్యారు. దేశ వ్యాప్తంగా 19 కొత్త రైల్వే లైన్ల సర్వే, 5 డబ్లింగ్ పనుల సర్వేకు గ్రీన్‌సిగ్నల్ వచ్చినా జిల్లాకు ఒరిగింది శూన్యం. స రిపడా నిధులు విడుదలై పెండింగ్ ప్రాజెక్టులు పూ ర్తయితేనే తప్ప కొత్త లైన్ల నిర్మాణాలకు మోక్షం క లగదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మళ్లీ నిరాశే..
Published Thu, Feb 13 2014 2:39 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement