క్వారీలకు అనుమతి తప్పనిసరి | No permissions for quarry works on tribal areas | Sakshi
Sakshi News home page

క్వారీలకు అనుమతి తప్పనిసరి

Published Wed, May 6 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

No permissions for quarry works on tribal areas

- పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
జి.మాడుగుల:
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేనిదే ఎటువంటి క్వారీ నిర్వహించరాదని పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మండలంలో సింగర్భ పంచాయతీ కంబాలుబయలు సమీపంలో ఏర్పాటు చేయబోతున్న చిప్స్ క్రషర్‌కు సంబంధించిన నల్లరాయి పట్టాభూముల జీపీఎప్ సర్వేను మంగళవారం ఆయన నిర్వహించారు. జి నిట్టాపుట్టు హెచ్‌వో కంబాలుబయలులో ఇంచికి చిన్నాచారికు చెందిన సర్వే నంబర్ 2.48 సెంట్లు నల్లరాయి కొండ భూమిని ఆయన పరిశీలించారు.

క్రషర్‌కు ఏర్పాటు చే సి భూమి వివరాలు, తదితర వివరాలపై క్రషర్ యజమాని రాంబాబునుంచి తెలుసుకున్నారు. నల్లరాయి భూమికు అనుకొని ఉన్న రైతుల ఫిర్యాదులు, పరిసర ఆర్‌ఎఫ్ భూములు వివరాలు, జీపీఎస్ సర్వే జెరాక్స్ కాఫీలను తమకు అందించాలని సబ్ డీఎఫ్‌వో శాంతి స్వరూప్ ఆదేశించారు. భూమి యజమాని సర్వే నంబర్, భూమి పట్టా సరిహద్దులు తదితర వాటిని సరిచూసుకోవాలని మైనింగ్  ఏడీ శివాజీని ఆయన ఆదేశించారు.

నల్లరాయి ప్రాంత భూములోని శాంపిల్స్‌ను పాడేరులోని తమ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. నల్లరాయి క్వారీ నిర్వహించనున్న భూములను క్షుణ్ణంగా అటవీశాఖ, మైనింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మైనింగ్ ఏడీ శివాజీ, పాడేరు పారెస్టు సబ్ డీఎఫ్‌వో శాంతిస్వరూప్,తహశీల్దార్ పాడి పంతులు, రేంజర్ గంగాధర్‌రావు, చంద్రశేఖర్, శ్రీరాములు, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎస్‌వి రమణ, ఎంఆర్‌ఐ కృష్ణమూర్తి, వీఆర్వో సుభామణి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement