ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, వృద్ధుల ప్రత్యేక దర్శనాలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసినట్టు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు.
సాక్షి, తిరుమల: ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, వృద్ధుల ప్రత్యేక దర్శనాలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసినట్టు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం సీవీఎస్‌వో నాగేంద్రకుమార్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, ఎస్‌ఈ-2 రామచంద్రారెడ్డితో కలసి ఆలయ వీధుల్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఆలయ మాడ వీధుల్లో పటిష్టమైన గ్యాలరీలు, బారికేడ్లు నిర్మించామని తెలిపారు. 18వ తేదీ గరుడ వాహన సేవ రోజున ద్విచక్ర వాహనాలను వేకువజాము ఒంటిగంట నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు అనుతించేది లేదన్నారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి తెలిపారు.