ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రంలో 20 వేలకుపైగా నామినేటెడ్ పోస్టులున్నాయి. డిసెంబర్ నెలాఖరుకు వీటిని భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. టీటీడీ పాలకమండలి కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. జపాన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఈ రోజు రాత్రి హైదరాబాద్ తిరిగిరానున్నారు.