విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ) పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ టోటలింగ్ కోసం జూలై 5లోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ విజయకుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 28 నుంచి 45వ కళాశాల కోడ్ వరకు జూలై 19న, 46 నుంచి 197 వరకు 20న కళాశాల గుర్తింపు కార్డు, హాల్ టికెట్‌తో ఉదయం 11 గంటలకు యూనివర్సిటీలో హాజరుకావాలని సూచించారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.