
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జామకాయకోన వద్ద 40 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించి ఎర్రచందనం దుంగలను పడేసి దట్టమైన అడవిలోకి స్మగ్లర్లు పారిపోయారు. 30ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం అటవీశాఖ అధికారులు ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment