Kumbing
-
ఏఓబీలో కలకలం..
మక్కువ: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో (ఏఓబీ) మళ్లీ కలకలం మొదలైంది. ప్రత్యేక బలగాల బూట్ల శబ్ధంతో ఏజెన్సీ అదురుతోంది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజులుగా యుద్ధ వాతవరణం నెలకొంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబీకి సరిహద్దు గ్రామాలైన ఎర్రసామతవలస, దుగ్గేరు, మూలవలస, బాగుజోల, చిలకమెండంగి, మెండంగి, గుంటబద్ర, తదితర గ్రామాల్లో బుధవారం ముమ్మర కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పళ్లు వినిపించాయి. వారంరోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒడిశా రాష్ట్రం మల్కనగిరి, విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల అటవీ ప్రాంతాలలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకొని ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. అలాగే మంగళవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు మంగళవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నాకాబందీ నిర్వహించారు. సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా గతంలో మక్కువ మండలంలో పలుమార్లు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అతికించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మక్కువ మండలం ఏఓబీ సరిహద్దులో ఉన్నందున మావోయిస్టులు ఎదో ఒక రూపంలో వారి ఉనికిని చాటుకునే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనల్లో కొన్ని.. 2011 మే 15న మక్కువ మండలం ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాలలో ఏఓబీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. గ్రీన్‌హంట్‌ను తిప్పికొట్టాలని అప్పట్లో బ్యానర్లు కట్టి కలకలం రేపారు. అదే ఏడాది జూలై 28న ఎర్రసామంతవలసలో మరో బ్యానర్ కట్టి వారి ఉనికిని మరోమారు చాటుకునే ప్రయత్నం చేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అప్పట్లో మావోయిస్టులు (సీపీఐ)పేరిట బ్యానర్‌ను కట్టి మన్యంలో కలకలం సృష్టించారు. 2011 ఏప్రిల్ 24న చెక్కవలస రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2012 ఫిబ్రవరి 17న దుగ్గేరులోని రామమందిరం వద్ద శ్రీకాకుళం–కొరాపుట్ డివిజనల్ కమిటీ పేరుతో గోడపత్రికను అతికించారు. అలాగే ఎర్రసామంతవలసలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను కాల్చి వేశారు. అలాగే పనసబద్ర గ్రామంలో కరువుదాడి జరిగిన సంఘటనలున్నాయి. ఏవోబీకి మక్కువ మండలం అతిసమీపంలో ఉన్నందున మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేయడం.. పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నించడం పరిపాటిగా మారుతోంది. -
శేషాచలం అడవుల్లో కూంబింగ్
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జామకాయకోన వద్ద 40 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించి ఎర్రచందనం దుంగలను పడేసి దట్టమైన అడవిలోకి స్మగ్లర్లు పారిపోయారు. 30ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం అటవీశాఖ అధికారులు ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టారు. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
రాయ్‌పూర్/చింతూరు (రంపచోడవరం)/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్లు, భద్రతా దళాలకు మధ్య సోమవారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 9 మంది నక్సల్స్‌తోపాటు ఇద్దరు పోలీసులు మరణించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతమైన కిస్తారం, చింతగుహ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ‘ఆపరేషన్ ప్రహార్ – ఐV’ పేరిట 1,200 మంది సిబ్బంది మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) డీఎం అవస్థీ చెప్పారు. తెలంగాణ పోలీసులతో కలసి ఛత్తీస్‌గఢ్ ఎస్టీఎఫ్, డీఆర్జీ దళాలు, సీఆర్పీఎఫ్ అనుబంధ కోబ్రా బృందాలు ఆదివారం రాత్రి తొండమర్క, సలెతోంగ్ గ్రామాలు, సక్లేర్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారని తెలిపారు. కిస్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సక్లేర్ గ్రామాన్ని డీఆర్జీ భద్రతా దళాలు సోమవారం ఉదయం 9.40 గంటలకు చుట్టుముట్టాయనీ, అక్కడ ఉన్న నక్సల్స్ కాల్పులకు దిగారన్నారు. అనంతరం డీఆర్జీ దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించగా ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్‌తోపాటు దిర్డో రామ, మడివి జోగా అనే ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు. మృతదేహాలను వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. చనిపోయిన నక్సల్స్‌లో ఇద్దరిని గుర్తించారు. వారిద్దరూ తాటి భీమ, పొడియం రాజే అనీ, వారిద్దరి తలలపై 8 లక్షల బహుమానం ఉందని అధికారులు తెలిపారు. చింతగుహ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్మగుండ గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కోబ్రా దళాలు ఓ నక్సల్‌ను అంతం చేశాయి. రెండు ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పదికి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«ధీనం చేసుకున్నామని అవస్థీ చెప్పారు. ఆపరేషన్ ప్రహార్ మొదటి మూడు దశలు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. పక్కా సమాచారంతోనే దాడి... త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో సమావేశం జరుగుతోందన్న సమాచారంతో ఛత్తీస్ పోలీసులు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 12న ఛత్తీస్‌లోని మావోప్రాబల్య ప్రాంతంలో ఎన్నికలు ముగియగా తెలంగాణలోని మావోయిస్టు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు ఆజాద్ సరిహద్దుల్లో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమయానికి ఆజాద్ సమావేశానికి హాజరు కాలేదని, ఈలోపుగానే బలగాలు ఆ సమావేశంపై దాడి నిర్వహించడంతో 8 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం. -
ఏవోబీలో కొనసాగుతున్న ఉద్రిక్తత..!
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న వారి కోసం దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. విచారణ నిమిత్తం అంత్రిగూడకు చెందిన గిరిజనులు గతవారం అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానిక గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. గ్రామస్థుల తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అంతే కాకుండా గిరిజనులకు మావోయిస్టులు సంబంధాలు ఉన్నయన్న కోణంలో వారిని ఆరా తీస్తున్నారు. కిడారి, సోమ హత్య జరిగి రోజులు గడుస్తున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం కోరాపూట్ డివిజన్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయని ఒడిశా ధ్రువీకరించింది. కానీ కాల్పుల్లో ఎవ్వరూ మృతిచెందలేదని... తప్పించుకున్న మావోయిస్టులున ఎలానైనా పట్టుకోవాలని దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయని పోలీసు అధికారులె వెల్లడించారు. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందనని ఏవోబీలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. -
ఎన్కౌంటర్ జరిగిందిలా...
శేషాచలం అడవుల్లోకి 150 మంది ఎర్రకూలీలు వచ్చినట్టు సోమవారం సాయంత్రం 7 గంటలకు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది.టాస్క్‌ఫోర్స్ డీఐజీ ఆదేశాల మేరకు 24 మందితో కూడిన సిబ్బంది బృందం ఆయుధాలతో శ్రీవారిమెట్టు నుంచి రాత్రి 8 గంటలకు కూంబింగ్ మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం 5 గంటలకు శ్రీవారిమెట్టు సమీపంలోని చీక టీగల కోన, సచ్చినోడు బండవద్ద 100 మంది ఎర్రకూలీలు టాస్క్‌ఫోర్స్ బృందాలకు ఎదురుపడ్డారు. ఆయుధాలతో ఉన్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని చూడగానే వారు రాళ్లు, గొడ్డళ్లతో దాడులకు దిగారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఉదయం 6 గంటల వరకు జరిగిన కాల్పుల అనంతరం 20 మంది కూలీల మృతదేహాలు పడి ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ డీఐజీ వెంటనే అర్బన్ ఎస్పీ, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మిగిలిన కూలీలు కోసం ఉదయం 9 గంటల వరకు కూంబింగ్ కొనసాగింది. అప్పటి వరకు మీడియాను అనుమతించలేదు. కూంబింగ్ పూర్తయి, కూలీలు పరారయ్యారని నిర్ధారించుకున్న తర్వాత అనుమతించారు. 10 గంటలకు టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్, తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మెజిస్టీరియల్ విచారణ ఆఫీసర్‌గా నియమితులైన చిత్తూరు డీఆర్వో విజయచంద్ర ఘటనా స్థలం చేరుకుని మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.మధ్యాహ్నం 2 గంటలకు రేంజ్ ఐజీ గోపాలకృష్ణ, డీఐజీ బాలకృష్ణ, అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి హెలికాప్టర్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఏరియల్ సర్వే చేశారు.సాయంత్రం 5 గంటలకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
మావోయిస్టుల కట్టడికి పోలీసుల వ్యూహం
ఏవోబీలో మావోయిస్టుల కట్టడికి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి నినాదంతో మారుమూల గూడేల్లోని వారిని దళసభ్యులకు దూరం చేయాలని యోచిస్తున్నారు. ఆదివాసీల నుంచి వారికి ఎటువంటి సాయం అందకుండా కట్టడి చేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లోని కొన్ని జాతుల గిరిజనులు ఇప్పటికీ మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేస్తున్నారు. దళసభ్యుల సభలు, సమావేశాలకు వెళుతున్నారు. మావోయిస్టుల ప్రజాకోర్టుల్లో పాల్గొంటున్నారు. పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రధానపాత్ర వహిస్తున్నారు. వారిలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. పాడేరు: ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పోలీసుశాఖ గుర్తించింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల సంచా రం అధికంగా ఉంటోంది. ఇటీవల జి.మాడుగుల మండలం గాదిగుంట రోడ్డు పనులను మావోయిస్టులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో నిరసన వ్యక్తమైంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జి.మాడుగుల మండలం గుదలంవీధి ఆశ్రమంపై దాడి, గాదిగుంట రోడ్డులో పొక్లెయినర్ ధ్వంసం సంఘటనల్లో దళసభ్యులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నప్పటికీ, సానుభూతిపరులైన కొన్ని గ్రామాల గిరిజనులే అధికంగా ఉన్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది. వీరంతా లొంగిపోతే కేసులు పెట్టకుండా జీవనోపాధికి పోలీసులుఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజనుల నుంచి మావోయిస్టులకు ఎలాంటి సహకారం లేకుండా చూడటంతోపాటు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. మారుమూల గూడేల్లోని గిరిజనులు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు దూరమయ్యారు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నా మావోయిస్టుల హెచ్చరికలతో నిర్మాణాలు సాగడంలేదు. రవాణా పరంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మావోయిస్టుల కారణంగానే రోడ్లు అభివృద్ధి చెందడం లేదనే నినాదంతో పోలీసుశాఖ ఆయా గ్రామాల్లో జనమైత్రి కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నది. జి.మాడుగుల మండలంలోని మారుమూల గాదిగుంట గ్రామంలో బుధవారం పోలీసులు జనమైత్రి నిర్వహించారు. దీనికి సుమారు 500 కుటుంబాల ఆదివాసీలు హాజరయ్యారు. వారికి ఉచితంగా దుస్తులు, స్టీల్, సిల్వర్ సామగ్రి, దోమ తెరలు, యువకులకు వాలీబాల్ కిట్లు, చదువుతున్న యువతకు స్టడీ మెటీరియల్, చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు. వారి సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చెందాలంటే మావోయిస్టులను తిప్పి కొట్టాలని పోలీసుశాఖ చెప్పుకొచ్చింది. గిరిజనులూ రోడ్ల అభివృద్ధిని కోరుకుంటున్నారు. సెల్ టవర్లు, ఔట్‌పోస్టుల ఏర్పాటు : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఔట్ పోస్టులు, సెల్ టవర్ల ఏర్పాటుకు పోలీసుశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. ఇందుకు స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు. ముందుగా సెల్ టవర్లను ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను గిరిజనులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు ఆయా పంచాయతీల గిరిజనుల నుంచి వినతులు కూడా పోలీసులు స్వీకరిస్తున్నారు. సమాచార వ్యవస్థ మెరుగుపడితే దళసభ్యుల ఆగడాలను అడ్డుకోవచ్చన్నది పోలీసుల వ్యూహం. -
కాల్పుల్లో జవాను మృతి
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. కేర్నపాల్ నుంచి కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మహేంద్రప్రతాప్యాదవ్ అనే హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని జగదల్పూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందాడు. -
సంచలన కేసులు ఛేదించాం
2014 క్రైంపై ఎస్పీ నవీన్‌గులాఠీ సమీక్ష క్రైం (కడప అర్బన్): జిల్లాలో ఈ ఏడాది పలు సంచలన కేసులను చేధించామని ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు. 2014 ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలపై పోలీసులు తీసుకున్న చర్యలపై శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఇప్పటికే మూడు బేస్ క్యాంపులలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 2014లో 236 కేసులు నమోదు చేశామని, రూ.23.30 కోట్ల విలువైన 5875 ఎర్రచందనం దుంగలను, 160 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుల్లో 937 మందిని అరెస్టు చేశామన్నారు. ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన జియోన్ హైస్కూలు కరస్పాండెంట్ కృపాకర్ఐజాక్, అతని భార్య మౌనిక, వారి ముగ్గురు పిల్లలు జియోన్ పాఠశాలలో పక్కపక్క గోతుల్లో శవాలుగా బయటపడ్డారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రామాంజనేయులురెడ్డితోపాటు రాజారత్నం ఐజాక్ తదితరులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండుకు పంపామన్నారు. కేసు విచారణలో ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో రాయచోటి పట్టణానికి చెందిన జ్యోతి తన తండ్రితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కె.వెంకటమ్మతో పాటు తన భర్త ప్రేమ్కుమార్నాయక్ను ప్రియుడి సాయంతో హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈనెల 19న నిందితులను అరెస్టు చేశామన్నారు. డిసెంబరు 2న తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తరలించిన కేసుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను అరెస్టు చేశామన్నారు. కమలాపురానికి చెందిన డాక్టర్ గణేష్‌ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు పఠాన్ అబ్దుల్ఖాన్తోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ఫోన్లు, రూ. 27 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులలో మట్కా ద్వారా 726 మందిని అరెస్టు చేసి రూ. 73.55 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్యాంబ్లింగ్ ద్వారా 4410 మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి రూ. 89.81 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 92 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేసి దాదాపు రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది దొంగతనాలు, దోపిడీల వల్ల రూ.6.60 కోట్ల ఆస్తినష్టం జరగ్గా, ఆ మొత్తంలో రూ. 2.62 కోట్లు రికవరీ చేయగలిగామన్నారు. రోడ్డు ప్రమాదాలు 1287 జరగ్గా, 406 మంది మృత్యువాత పడ్డారని, 1776 మంది గాయపడ్డారని వివరించారు. 1,03,944 ఎంవీ కేసులు నమోదు చేసి రూ. 2.35 కోట్లు జరిమానాగా వసూలు చేశామన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ సంబంధిత కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయన్నారు. 3069 ఫిర్యాదులు కేంద్ర ఫిర్యాదుల విభాగానికి రాగా, వాటిలో 1931 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మినీ కల్యాణ మండపానికి దివంగత ఆర్ఎస్ఐ నరసింహులు నామకరణం చేశామన్నారు. ఉమేష్చంద్రతోపాటు మృతి చెందిన కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి స్మారకంగా పోలీసులేన్లో చిన్న పిల్లల పార్కును అభివృద్ధి చేశామన్నారు. పెరేడ్‌గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ కేటాయించిన నిధుల ద్వారా నూతన వేదికను, పోలీసుశాఖ నిధులతో అమర వీరుల స్థూపాలను నిర్మింపజేశామన్నారు. డయల్ 100 ద్వారా 21,294 కాల్స్ రాగా, వాటిలో 1819 కేసులను నమోదు చేయగలిగామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణలో భాగంగా మూడు పోలీసు కాల్పుల సంఘటనలు జరగ్గా, వాటిలో నలుగురు తమిళ కూలీలు మృతి చెందారన్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీలు జనవరి 1వ తేదీని పురస్కరించుకుని అర్ధరాత్రి 12.30 గంటల్లోపు కార్యక్రమాలు ముగించుకోవాలని, ఎవరూ రాత్రి 8 తర్వాత మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, ప్రజలు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఎస్బీ సీఐ బాలునాయక్, పోలీసు పీఆర్ఓ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
తిరగబడ్డ ‘ఎర్ర’ కూలీలు
చంద్రగిరి: శేషాచలంలో ఎర్రచందనం చెట్లును కూల్చి దుంగలు తరలించడానికి వచ్చిన కూలీలు పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ ఘటన మామండూరు వద్ద ఉన్న అబ్బాలి రామానాయుడు మామిడితోట సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలను శనివారం పోలీసులు విలేకరులకు తెలిపారు. ఎస్ఐ జయచంద్ర మాట్లాడుతూ మామండూరు సమీపంలోని అబ్బారి రామానాయుడు మామిడి తోట సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్టు శుక్రవారం రహస్య సమాచారం అందిందన్నారు. సీఐ మల్లికార్జున గుప్తా ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు. కూలీలు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికియత్నించారన్నారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంతో 17మంది ఎర్రకూలీలను పట్టుకున్నట్టు తెలిపారు. అయితే మరో ఇద్దరు కూలీలు పరారయ్యారన్నారు. పట్టుబడిన వారినుంచి ఓ టాటా సుమో, 20 ఎర్రచందనం దుంగలు,దాడికియత్నించిన గొడ్డళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూలీలు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి, ధర్మపురి జిల్లాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. అనంతరం కూలీలపై కేసు నమోదు చేసి కోర్టుకుతరలించినట్టు ఆయన వెల్లడించారు. -
మన్యం జల్లెడ
భారీగా బలగాల మోహరింపు మావోయిస్టు పార్టీ దశాబ్ది ఉత్సవాలను అడ్డుకొనే వ్యూహం ఆరు మండలాలపై ప్రత్యేక దృష్టి పోలీసులు, మావోల సంచారంతో గిరిజనుల్లో భయం మావోయిస్టుల దశాబ్ది ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో మన్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్‌తోపాటు ఏపీఎస్పీ పోలీసులను కూంబింగ్‌కు దింపారు. ఒడిశా సరిహద్దు వరకు పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గిరిజనుల సాయంత్రానికే ఇంటికి చేరుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పాడేరు /కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల అలజడితో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ దశాబ్ది ఉత్సవాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ఉద్యమాలు నడుపుతున్న మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల విశాఖ ఏజెన్సీలో చొరబడి ప్రజా సదస్సులు, బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసు యంత్రాంగం కూంబింగ్ చర్యలను ఉధృతం చేసింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మూడురోజుల నుంచి పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. అదనపు పోలీసు బలగాలను కూడా పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ఒడిశా సరిహద్దు వరకు పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టులు కూడా అభయారణ్యంలో సంచరిస్తున్నారు. మావోల సంచారంపై సమాచారం తెలుసుకుంటూనే పోలీసులు కూడా అటువైపే గాలింపు చర్యలు చేపడుతుండడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మా రుమూల గ్రామాలలో గిరిజనులు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల సంచారంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఈ మారుమూల గ్రామాల గిరిజనుల్లో నెలకొంది. 20 గ్రామాల్లో కూంబింగ్ : ఈనెల 13న తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం జంగాలతోటలో మువ్వల నరేశ్‌ను మావోయిస్టులు హతమార్చడంతో తూర్పు పోలీసులు కూడా వై.రామవరం - కొయ్యూరు మండలాల సరిహద్దుగా ఉన్న 20 గ్రామాల్లో కూంబింగ్ చేపట్టారు. కొన్నిచోట్ల పోలీసులు గుర్తుపట్టేందుకు వీలు లేకుండా తలపాగా చుట్టుకుని లుంగీలతో వెళుతున్నట్టుగా గిరిజనులు చెబుతున్నారు. ఆదివారం కొయ్యూరు సంత కావడంతో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సుమారు 30 గ్రామాలకు చెందిన గిరిజనులు దీనికి వస్తారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులు కూడా ఈ సంతకు వస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు తనిఖీలు చేశారు. అగ్రనేతల సంచారం చింతపల్లి : విశాఖ మన్యంలోకి మావోయిస్టు అగ్రనేతలు ప్రవేశించారనే పక్కా సమాచారంతో పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దు ప్రాంతంలో ఇటీవల గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం విధితమే. ఇటీవల జీకేవీధి మండలంలో ఒక మారుమూల అటవీ ప్రాంతంలో భారీ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు అగ్రనేతలైన చలపతి, రవి కూడా హాజరుకావాల్సి ఉంది. విషయం రెండురోజుల ముందే పోలీసులకు తెలియడంతో ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. పోలీసులు వచ్చారనే సమాచారం తెలుసుకుని అగ్రనేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు ఇళ్లకు చేరుకుంటున్నారు. -
పీఎల్జీఏ ప్రశాంతం
ముగిసిన అమరవీరుల వారోత్సవాలు పట్టుసాధించిన పోలీసు యంత్రాంగం కలిసొచ్చిన ముందస్తు వ్యూహం పాడేరు/కొయ్యూరు/జీకేవీధి : మావోయిస్టు అమరవీరుల(పీఎల్జీఏ)వారోత్సవాలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ప్రశాంతంగా ఆదివారంతో ముగిశాయి. దళసభ్యులు అక్కడక్కడ స్థూపాలు ఏ ర్పాటు చేసి స్థానికులతో కలిసి అమరవీరుల కు నివాళులర్పించినప్పటికీ ఎటువంటి వి ధ్వంసకర సంఘటనలకు పాల్పడిన దాఖ లాలు లేవు. అన్ని వైపుల నుంచి పోలీసుల కూంబింగ్ ఉధృతంతో మావోయిస్టులు వారోత్సవాల నిర్వహణకు అవకాశం లేకుండాపోయింది. గూడెంకొత్తవీధి మండలం కుంకంపూడిలో దళసభ్యులు 30 అడుగుల భారీ స్తూపం నిర్మాణ పనులు చేపట్టారు. అది పూర్తయ్యే తరుణంలోనే దళ సభ్యుడు కొర్రా సీతన్న, గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తుగా చేపట్టిన వారి వ్యూహరచన కలిసొచ్చింది. ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, కొయ్యూరు, జి.మాడుగుల, చింతపల్లిల్లో ఎక్కడా వారోత్సవాల ఊసు లేదు. వారోత్సవాలకు ముందు నుంచే యంత్రాంగం అప్రమత్తమైంది. మారుమూల గూడేల్లోని గిరిజనులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరించొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గిరిజనులు గ్రామాలకే పరిమితమయ్యారు. జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్, నర్సీపట్నం ఓఎస్డీ ఎఆర్ దామోదర్ సైతం మావోయిస్టు ప్రభావిత పోలీసు స్టేషన్లు సందర్శించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో బలగాలు గాలింపు చేపట్టాయి. పకడ్బందీ ప్రణాళిక: ఎస్పీ వారోత్సవాల భగ్నానికి పక డ్బందీ ప్రణాళికను అమలు చేసి మంచి ఫలితం సాధించామని రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఆదివారం ఫోన్లో సాక్షికి తెలిపారు. భారీస్థాయిలో కూంబింగ్ చేపట్టామన్నారు. ఒడిశా సరిహద్దులోనూ బలగాలు జల్లెడ పట్టాయన్నారు. వారోత్సవాలను పూర్తిగా అడ్డుకున్నామన్నారు. మావోయిస్టులకు స్థానిక గిరిజనులు ఎలాంటి సహకారం అందించలేదన్నారు. మావోయిస్టులపై వ్యతిరేకత నెలకొందని గిరిజనులంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని తెలిపారు. -
అడవిలో జల్లెడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమ’ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిరోజులుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మావోల సంచారం, కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్, పలువురు వ్యాపారులు, ప్రముఖులకు డబ్బు కోసం బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. శని వారం అటవీ ప్రాంతంలో సాయుధ పోలీసులు ప్రవేశించి మొత్తంగా జల్లెడ పడుతున్నట్టు సమాచారం. ఏలూరు నుంచి అడవిలోకి వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీస్ బృందంలో 14మంది సభ్యులున్నట్టు తెలుస్తోంది. అయితే, కూంబింగ్‌పై అధికారికంగా సమాచారం ఇచ్చేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అసలు ఆ ప్రాంతంలో సంచరిస్తోంది మావోయిస్టులా.. వారి పేరుచెప్పుకుని నకిలీ దళాలు దందా చేస్తున్నాయా అనే అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ‘పశ్చిమ’ ఏజెన్సీలో తెలంగాణలోని మావో ప్రభావిత ఖమ్మం జిల్లా మండలాలు కలిసిన నేపథ్యంలో మావోయిస్టుల వ్యవహారంపై సీరియస్‌గానే దృష్టి కేంద్రీకరించామని ఆ అధికారి వెల్లడించారు. -
భయంతో వణుకుతున్న మన్యం
ఒక వైపు మావోయిస్టుల విధ్వంసాలు మరోవైపు పోలీసుల కూంబింగ్‌లు కొయ్యూరు,. న్యూస్‌లైన్ : గిరిజన పల్లెలు భయంతో వణుకుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఉంది వారి పరిస్థితి. ఓ వైపు మావోయిస్టులు వరుస విధ్వంసాలకు తెగబడుతుండగా మరో వైపు పోలీసులు కూంబింగ్‌లతో హడలెత్తిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని ఓ వైపు మావోయిస్టులు పిలుపునిస్తుండగా ఎన్నికలను పక్కా గా నిర్వహించాలని పోలీసు లు ప్రతినబూనారు. దీంతో ఇరువర్గాల నడుమా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వారం కిందట బూదరాళ్ల పంచాయతీలో ముకుడుపల్లి, కిండంగి గ్రామాలకు చెందిన 21 మంది మిలీషియా సభ్యులు జిల్లా రూరల్ ఎస్సీ దుగ్గల్ ఎదుట లొంగిపోయారు. మరో ఐదుగురిని అరెస్టు చేశారు. కొన్ని గ్రామాలను పోలీసులు చుట్టుముట్టి గిరిజనులను తీసుకుపోవడంతో వారి బంధువులు మండల కేంద్రానికి వచ్చి నేతలను కలుస్తున్నారు. అయితే పోలీసులు వద్ద ఉన్న సమాచారం మేరకు గిరిజనులను తీసుకెళ్లి విచారిస్తున్నారు. వారు సానుభూతిపరులు అని తేలితే అరెస్టు చేస్తున్నారు. మావోయిస్టులు ఇటీవల విధ్వంసాలకు పాల్పడడంతో పోలీసులు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేం దుకు అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే వాటిని ఉపసంహరించుకోవాలంటూ గిరిజనులు ర్యాలీలు,ఆందోళనలు చేస్తున్నారు. పోలీసు అధికారులు మాత్రం ఆ ర్యాలీల వెనక మావోయిస్టుల హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారు. ఎక్కువమందిపై బైండోవర్లు..? : 2009 ఎన్నికల్లో మారుమూల ప్రాంతాలకు సంబంధించి ఎవరికైతే మావోయిస్టులతో సంబంధాలున్నాయని కేసులు పెట్టారో అలాంటి వారిపై తిరిగి బైండోవర్లు చేసే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న బూదరాళ్ల,పలకజీడి, పెదలంక కొత్తూరు, ఎం.బీమవరం లాంటి చోట్ల ఎన్నికలు నిర్వహించడం కష్టంగా నే ఉంటుంది. అధికారులు కొన్ని చోట్లకు నడిచి వెళ్ల్లాలి. పోలింగ్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడతారు. దీంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఉండేం దుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. -
‘ఏవోభీ’తావహం
గూడెంకొత్తవీధి/పాడేరు,న్యూస్‌లైన్: ఒడిశా,ఛత్తీస్‌గఢ్ సంఘటనలతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఈస్ట్‌డివిజన్ అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు అంతటా పోలీసు బలగాలు మోహరించాయి. ఎప్పుడే సంఘటన చోటుచేసుకుంటుందోనన్న ఆందోళనతో మారుమూల తండాల్లోని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాధవ్ అలియాస్ గొల్లూరి రాములు ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో మంగళవారం బీఎస్ఎ్ఫ్ జవాన్లపై ప్రతీకార దాడులకు తెగబడ్డారు. దీంతో సరిహద్దు ప్రాంతాల తోపాటు విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో పోలీసు యంత్రాం గం అప్రమత్తమైంది. మన్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పట్టున్న జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి ప్రాంతాలకు మావోయిస్టులు చేరుకుంటారనే అనుమానంతో భద్రత సిబ్బంది అడవిని జల్లెడపడుతున్నారు. పెద్ద ఎత్తున బలగాలను ఏజెన్సీకి తరలిస్తున్నారు. ఒకవైపు గాలింపు, మరోవైపు ముమ్మర తనిఖీలు చేపడుతూనే ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెట్టారు. ఇరువర్గాల ప్రతీకార దాడుల ప్రభావం ఈస్ట్ డివిజన్‌పై పడింది. ‘తూర్పు’ పోలీసుల ముమ్మర గాలింపు కొయ్యూరు: తూర్పు గోదావరి పోలీసులు విశాఖ సరిహద్దుల్లో కూంబింగ్‌ను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా ‘తూర్పు’ పోలీసులు కొయ్యూరు మండలంలో అనేక గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలుగా గుర్తింపు పొందిన పలకజీడి దాటి లోతట్టు ప్రాంతాలైన మర్రిపాకలు, నీలవరం, గంగవరం, ఈదులబంద తదితర గ్రామాలలో కూంబింగ్ జోరు పెంచారు. జీకేవీధి మండలానికి అనుకుని ఉన్న పుట్టకోట,పెదలకం, మండపల్లి వరకు కూంబింగ్ నిర్వహించారు. ఈ నెల 14న సుమారు 150 మంది వరకు మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పలకజీడి సమీపంలోకి వచ్చారు. వారిలో 25 మంది పాఠశాల వద్దకు వచ్చి నల్లజెండాలు పాతి స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మిగిలిన దళసభ్యులు సమీపంలో టేకు ప్లాంటేషన్ వద్ద కాపు కాశారు. మావోయిస్టులు అక్కడ పాఠశాల గురించి ఆరా తీసి, అక్కడే ఉద్యోగం చేస్తున్న అటవీ శాఖ గార్డు రమణను హెచ్చరించి ఉద్యోగం మానేయాలని కొట్టినట్టుగా తెలిసింది. విషయం తెలిసిన తూర్పుగోదావరి పోలీసులు వెంటనే పలకజీడి నుంచి కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఆ ప్రాంతంలో దాదాపు 50 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న అడవిని జల్లెడ పట్టారు. గుత్తికోయల జాడలు? పలకజీడి వచ్చిన మిలీషియా సభ్యుల్లో ఎక్కువ మంది గుత్తి కోయలున్నట్టు తెలుస్తోంది. వారు మాట్లాడిన తీరు, చంపేస్తామని భయపెట్టిన విధానం చూస్తుంటే ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు కూడా అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈస్టు డివిజన్ పరిధిలోకి తూర్పుగోదావరి కూడా వస్తుంది. గతంలో నాగులకొండ, యల్లవరం దళాలు ఎక్కువగా తూర్పు మన్యంలో తిరిగేవి. 2001లో ఏరియా కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత కోనలోవ పేరిట ఒకదానిని ఏర్పాటు చేసినా అది పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మావోయిస్టుల కదలికలు విశాఖ మన్యంలోనే అధికం అయ్యాయి. ఇప్పుడు మావోయిస్టులు తూర్పుగోదావరి సరిహద్దుల వరకు రావడంతో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు. రంపచోడవరం ఏఎస్పీ ఆరా తూర్పుగోదావరి మన్యంలో మావోయిస్టుల కదలికలపై రంపచోడవరం ఏఎస్పీ ఆరా తీస్తున్నారు. పలకజీడిలో చోటు చేసుకున్న సంఘటన గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ ఉద్యోగి రమణను కూడా ఆయన విచారించినట్టు తెలిసింది.