సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏడాదిన్నర కాలంగా జిల్లా రైతులను ప్రకృతి వైపరీత్యాలు పట్టిపీడిస్తున్నాయి. రెండుమూడు రోజుల కిందట తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వెయ్యి ఎకరాలకు పైగా పం టనష్టం వాటిల్లింది. జుక్కల్, మాక్లూర్, బోధ న్, జక్రాన్‌పల్లి, నిజాంసాగర్ మండలాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్టోబర్‌లో కురిసిన వర్షానికి జిల్లాలో 6,600 ఎకరాలలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలు నష్టపోయాయి. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పంటనష్టంపై ఇప్పటి వరకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించలేకపోయిం ది. 50 శాతానికిపైగా పంటలు నష్టపోతేనే పరి హారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామని వ్యవసాయాధికారులు పేర్కొం టున్నారు.
అక్టోబర్‌లోనూ, ప్రస్తుతం కురిసిన వర్షాలతోనూ కళ్లాల్లో ఉన్న వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.అయితే, కోతకోసిన పంటలు తమ పరిధిలోకి రావని వ్యవసాయశాఖ పే ర్కొంటోంది. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ కూడా చేతికందాల్సిన పంటనష్టంపై అంచనా వేయలేకపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆగ స్టులో కురిసిన వర్షాలతో జిల్లాలోని డిచ్‌పల్లి, నవీపేట, బిచ్కుంద మండలాల్లోని 209 మంది రైతులకు చెందిన 1,327 హెక్టార్లలోని పత్తి, పెసర, మినుము పం టలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు 50 శాతం సబ్సిడీతో విత్తనాలను పంపిణీ చేసిన సర్కారు పరిహారం మాత్రం ఇప్ప టి వరకు అందించలేదు.
ఆత్మహత్యలే శరణ్యం
ప్రకృతి ఓ వైపు తీవ్ర నష్టానికి గురిచేస్తుండగా, మరోవైపు సర్కారు ఆదుకోకపోవడంతో రైతు లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పు లు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో ఆరుగురు రైతులు బలవన్మరణం పొందారు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటపరిహారంపై శ్రద్ధచూపని విధంగానే కిరణ్ సర్కారు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదు. జిల్లాలో ఒక్క రైతే ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. మిగితా ఐదుగురు రైతులు పంటనష్టం, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో కురి సిన వర్షం కారణంగా పొలంలోని వరి మెదళ్లు దెబ్బతినడంతో ఆవేదనకు గురైన లింగం పేట మండలం శెట్‌పల్లి సంగారెడ్డికి చెందిన రైతు బాగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు కుటుంబం ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కులేక రోడ్డున పడింది. బాధిత కుటుంబాన్ని ఆదు కోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కదలని సర్కారు
Published Thu, Nov 28 2013 3:05 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement