సస్పెన్షన్ ఎత్తివేయాలని లేఖ రాశా: బొత్స | PCC chief Botsa satyanarayana write a letter to Kamalnath | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్ ఎత్తివేయాలని లేఖ రాశా: బొత్స

Published Sat, Aug 24 2013 2:35 PM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

PCC chief Botsa satyanarayana  write a letter to Kamalnath

హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్కు లేఖ రాసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులను కోరినట్లు ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక నేతలు కోరారని బొత్స తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న విధానాన్ని అధ్యాయనం చేసి, ఆర్టీసీ ప్రభుత్వంలో కలిపే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఆయన వెల్లడించారు. లోక్ సభ నుంచి 12మంది సీమాంధ్ర ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement