ఆధార్ సీడింగ్‌కు స్పెషల్ డ్రైవ్ | pecial drive to Aadhaar seeding | Sakshi
Sakshi News home page

ఆధార్ సీడింగ్‌కు స్పెషల్ డ్రైవ్

Published Wed, Dec 31 2014 5:33 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

pecial drive to Aadhaar seeding

సాక్షి, విశాఖపట్నం:  జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని తక్షణం గ్యాస్ డీలర్లకు అంద జేయాలని జేసీ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. వాటి వివరాలు సేకణలో నిర్లక్ష్యం వహిస్తున్న రైల్వే, కోరమండల్, పోలీస్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రాత్రి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీల పరిధిలో వచ్చే జనవరి 3,4,5 తేదీల్లో సీడింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం నమోదుకు ఈ అవకాశాన్ని గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీలర్లు తమ పరిధిలోని వినియోగదారుల నుంచి సమాచారం సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, వారికి సహకరించాలన్నారు. ఆధార్ ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారి కోసం విశాఖ నగర పరిధిలో 21 ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఆయా కేంద్రాలకు వెళ్లి ఆధార్ నమోదు చేయించుకుంటేనే వారం రోజుల్లో నంబర్లు కేటాయిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఇంటింటికి వెళ్లి ఈసమాచారం సేకరించే కార్యక్రమం చేపడతారన్నారు. జనవరి మొదటివారం లోగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ ప్రక్రియ నూరుశాతం పూర్తి కావాలన్నారు.

ఆధార్,బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాకుంటే ఏప్రిల్ ఒకటి తర్వాత వారికి గ్యాస్ సరఫరా నిలిపివేసే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకులు తమ వద్దకు గ్యాస్ డీలర్లు తీసుకు వచ్చే దరఖాస్తులను స్వీకరించి సమాచారం నమోదు చేయాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖాధికారులు రవితేజ నాయక్, శాంతకుమారి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement