సాక్షి, అమరావతి: నీరు–చెట్టు నిధులను టీడీపీ దుర్వినియోగం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ‘పచ్చ’బాబుల జేబుల్లోకే ఉపాధి నిధులు వెళ్లాయన్నారు. తాను ముడుపులు తీసుకున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారని, దీన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు రాకుండా టీడీపీ లేఖలు రాస్తోందన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేయిస్తామన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తాము వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని తెలిపారు. ఈ ఆరి్థక సంవత్సరంలో కూలీలకు వేతనాలను చెల్లించామన్నారు. పనులకు బిల్లులు చెల్లించాలని కేంద్రాన్ని మూడుసార్లు అడిగినా ఇవ్వలేదన్నారు. రూ.1,845 కోట్ల నిధులే వచ్చాయన్నారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సహా పలు ప్రాంతాల్లో రూ.46 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందన్నారు.
స్పీకర్‌తో టీడీపీ సభ్యుల వాగ్వాదం
టీడీపీ హయాంలో ఉపాధి హామీ నిధుల దురి్వనియోగంపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం ఇచి్చన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోనూ వాగ్వాదానికి దిగారు. చర్చ సందర్భంగా గత ప్రభుత్వ అవినీతిని అధికార పక్ష సభ్యులు గట్టిగా ప్రశి్నంచారు. సమగ్ర విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఉపాధి హామీ నిధులను ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం దోచేశారని విమర్శించారు. వీళ్లు చేసిన పాపానికి 417 మంది అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. 250 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. రోడ్ల నిర్మాణంలోనూ భారీ దోపిడీ జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉదయభాను ఆరోపించారు. నారా లోకేశ్ నేతృత్వంలో ఉపాధి నిధులను పప్పు బెల్లాల్లా దోచుకున్న వైనాన్ని ప్రజల ముందుంచాలని జోగి రమేష్ కోరారు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
పచ్చ బాబులకే.. ‘ఉపాధి’
Published Wed, Dec 18 2019 4:35 AM | Last Updated on Wed, Dec 18 2019 4:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment