'తీర ప్రాంత ప్రజలను వేగంగా తరలిస్తున్నాం' | People evacuate very fastly due to 'Hudhud' Cyclone, says SS Guleria | Sakshi
Sakshi News home page

'తీర ప్రాంత ప్రజలను వేగంగా తరలిస్తున్నాం'

Published Sat, Oct 11 2014 10:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

People evacuate very fastly due to 'Hudhud' Cyclone, says SS Guleria

విశాఖపట్నం: హుదూద్ తుపాన్ దూసుకువస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు 19 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపినట్లు ఆ సంస్థ డీఐజీ ఎస్ ఎస్ గులేరియా వెల్లడించారు. ఓడిశాలో రిజర్వ్లో ఉన్న నాలుగు బృందాలను కూడా విశాఖకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. శనివారం విశాఖపట్నంలో గులేరియా విలేకర్లతో మాట్లాడుతూ... తుపాన్ నష్ట నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

తీర ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలిస్తున్నట్లు తెలిపారు. కొంత మంది ప్రజలు తమ ప్రాంతం నుంచి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని వారి బలవంతంగా  సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఐఎండీ సమాచారం మేరకు విశాఖపట్నం - విజయనగరం మధ్య హుదూద్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని గులేరియా వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ గులేరియా విశాఖపట్నంలో మకాం వేసి కోస్తా జిల్లాల్లో హుధుద్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement