ప్రభుత్వ పథకాలు అందలేదని నినాదాలు చేస్తున్న శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామస్తులు (ఫైల్)
నిరసనలు..నిలదీతలు..బహిష్కరణల నడుమ ఆరో విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమం ముగిసింది. తిత్లీ తుపాను నష్ట పరిహారం అందలేదని బాధితులు..గత జన్మభూమిలో అందించిన వినతులు పరిష్కారం కాలేదని సామాన్యులు.. రేషన్‌కార్డులు, పింఛన్లు అర్హులకు అందలేదని దరఖాస్తుదారులు అధికారులు, ప్రజా ప్రతినిధులను సభల్లో నిలదీశారు. సమస్యలను పరిష్కరించలేని గ్రామసభలు ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు ఇబ్బంది పడ్డారు. జన్మభూమి ప్రారంభం రోజు నుంచి ముగింపు వరకూ ఇదే పరిస్థితి. ఈ నెల రెండో రెండో తేదీన ప్రారంభమైన గ్రామ సభలు శుక్రవారంతో ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఈసారి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,609 వినతులు అధికారులకు అందాయి.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆరో విడత జన్మభూమి కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్ అయిందనే అభిప్రాయం జనం నుంచి వ్యక్తమవుతోంది. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన గ్రామ సభలతో ఎలాం టి ప్రయోజనం లేకపోవడంతో నామమాత్రంగా నే ముగిశాయి. గత ఐదు విడతుల్లో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో పలు విభాగాలకుసంబంధించి 2,96,856 వినతులు రాగా.. ఆరో విడతలో 45 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 20,609 వినతులు వచ్చాయి. తాజాగా ముగి సిన కార్యక్రమంతో కలిపి 3,17,465 వినతలు వచ్చాయి. గత వినతులే పరిష్కారానికి నోచుకోలేదు. ఈ పరి స్థితిలో తాజాగా వచ్చిన వినతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే. ఆరో విడత జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రజలకంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులే ఎక్కు వ కనిపించారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు జన్మభూమిలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చదువులు గాలికి వదలి సభల్లో కూర్చున్నారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో ఒక్క పింఛను కూడా ఎవరికీ అందజేయలేదు. అలాగే ఒక్క రేషన్‌కార్డు కూ డా జారీ చేయలేదు. కొత్తగా ఇళ్లు కూడా మంజూ రు చేయలేదు. దీంతో లబ్ధిచేకూరని సభలెందుక ని చాలచోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. మరికొన్ని చోట్ల సభలను అడ్డుకొన్నారు. దీంతో పోలీసుల జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని చాలా సభలను ప్రజలు బహిష్కరించా రు. కొన్ని సభల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బందులు పడ్డా రు. జిల్లావ్యాప్తంగా 1098 గ్రామ పంచాయతీ లు, 161 నగర, పురపాలక సంఘాల పరిధిల్లోని వార్డుల్లో ఆరో విడత గ్రామ సభలు జరిగాయి. వీటిలో చాలా సభల్లో నిరసనలు, నిలదీతలు, బహిష్కరణలు చోటుచేసుకున్నాయి.
వచ్చిన వినతులు..
ఈసారి జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో చివరిరోజు మినహా తొమ్మిది రోజులకు గాను 18,609 వినతులు వచ్చాయి. వీటిలో పేదరికానికి సంబంధించిన సమస్యలే ఎక్కువగా నమోదయ్యాయి. చివరి రోజున మరో రెండు వేలు వరకు వినతులు అందాయి. అయితే ఇవి ఇంకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. మొత్తం 20,609 వరకూ వినతులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో పేదరికానికి సంబంధించి–8060 వినతులుండగా, సివిల్ సప్‌లై విభాగం (రేషన్‌కార్డు)– 4781, గృహనిర్మాణం –2566, పురపాలక సంఘాల్లో సమస్యలపై –834, ఉద్యానవన శాఖ – 575, భూ సమస్యలు 386, పశు వర్ధక శాఖ 293, వ్యవసాయం 238, మత్స్యశాఖ 213, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ వింగ్ 109, గ్రామీణ నీటి సరఫరా 99, గిరిజన సంక్షేమ శాఖ 92, పంచాయతీరాజ్ 80, బీసీ కార్పొరేషన్ 79, విద్యుత్ శాఖ 35, గ్రామీణాభివృద్ధి 30, రైతు సాధికార సంస్థ 23, రోడ్లు భవనాల విభాగం 21, పాఠశాల విద్య 18, మహిళా భివృద్ధి శాఖ 9, ఆరోగ్య శ్రీ 9, చేనేత శాఖ 8, ఉపాధి కల్పన, శిక్షణకు సంబంధించి –8, ఇరిగేషన్ 7, ఎస్‌ఎస్‌ఏ 5, ఎస్సీ కార్పొరేషన్ 4, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు శాఖలకు మూడేసి, కమర్షియల్ టాక్సు, వికలాంగుల శాఖ, ఆర్‌టీవో, అగ్నిమాపక శాఖలకు సంబంధించి రెండేసి, ఫైనాన్స్, పోలీస్, ఎండోమెంట్, క్రీడలు, అటవీ, నైనిక సంక్షేమం, మైక్రో ప్రాజెక్టులు, కార్మిక శాఖ, భూ గర్భజలాలు, బీమా విభాగం, పరిశ్రమలు, వెనుకబడి తరగతుల శాఖలకు సంబంధించి ఒక్కో వినతి అధికారులకు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment