నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు పట్టణ ఇన్‌స్పెక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
భువనగిరి, న్యూస్‌లైన్ :నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న వ్యక్తిని అరెస్‌ట చేసి రిమాండుకు తరలించినట్టు పట్టణ ఇన్‌స్పెక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోత్కూరు మండలం సుందరయ్య కాలనీకి చెందిన చింత నగేష్ గతంలో బొగ్గు వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఎలాగైన డబ్బు సంపాదించి బాగుపడాలని భావించి ఇటీవల సెకండ్‌హ్యాండ్‌లో కలర్ జిరాక్‌స మిషన్, స్కానర్ కొనుగోలు చేశాడు. నకిలీ రూ.100, రూ.500 నోట్లను ప్రింట్ తీశాడు.
ఒరిజినల్ వంద రూపాయలు ఇస్తే నకిలీవి రూ.300 ఇస్తున్నాడు. శుక్రవారం భువనగిరి బస్టాండ్‌లో దొంగనోట్లు చలామణి చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. నగేష్ వద్ద నుంచి రూ.1500, అతని ఇంటి వద్ద 85వేల దొంగ నోట్లు, కలర్ ప్రింటర్, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఐడీపార్టీ సిబ్బందిని ఇన్‌స్పెక్టర్ అభినందించారు. సమావేశంలో ఐడీ పార్టీ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్.బాలస్వామి, రమేష్, జానయ్య, హోంగార్డు రాజు పాల్గొన్నారు.