ఫించన్ కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎంతమంది అధికారులను కలిసినా రాకపోవడంతో ఓ వికలాంగుడు సెల్‌టవర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు.
కోరుకొండ(తూర్పుగోదావరి జిల్లా): పింఛను కోసం ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎంతమంది అధికారులను కలిసినా రాకపోవడంతో ఓ వికలాంగుడు సెల్‌టవర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగింది. గాదరాడ గ్రామానికి చెందిన సీహెచ్. వీరబాబుకు గతంలో రూ. 200 పింఛను వచ్చేది. ప్రభుత్వం మారిన తర్వాత అతనికి పింఛను అందడం లేదు. గ్రామంలోని రైతు కన్వీనర్ తోరాటి శ్రీను సహాయంతో ఎన్నో సార్లు అధికారులను కలిశాడు. అయినా పింఛను అందకపోవడంతో సోమవారం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న సెల్‌టవర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. తోరాటి శ్రీను సెల్‌టవర్ ఎక్కగా, వీరబాబును పోలీసులు అడ్డుకున్నారు. శ్రీను మాత్రం సెల్‌టవర్‌పైనే ఉండిపోయాడు.
కోరుకొండ మండలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ రాజనగరం నియోజకవర్గ ఇంచార్జి జక్కంపూడి విజయలక్ష్మీ ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ధర్నాకు దిగారు.