
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేపర్ వాల్యూవేషన్‌లో అన్యాయం జరిగిందని ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నా చేపట్టారు. తక్కువ మార్కులు ఇచ్చి, కావాలనే ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
ఎటెంమ్ట్ చేసిన ప్రశ్నలకు కనీస మార్కులు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీస మర్యాద కూడా లేకుండా యూనివర్సిటీ సిబ్బంది అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూవేషన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment