ఖమ్మం: పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో, ఖమ్మం జిల్లా వేలేరుపాడులో పెద్ద ఎత్తున గురువారం రాస్తారోకో చేపట్టారు. పోలవరం బాధితులకు న్యాయం జరిగేలా ప్యాకేజీ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి సీపీఐ నేతలు వసంతరావు, సీతారామిరెడ్డి, వేలేరుపాడుకు చెందిన ఎండీ మునీరు, కారం గారెయ్య, ప్రసాద్, నిర్వాసితులు పాల్గొన్నారు.
(వేలేరుపాడు)
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
Published Thu, Jan 29 2015 1:13 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement