కోదాడరూరల్, న్యూస్‌లైన్
మండలంలోని నల్లబండగూడెం-రెడ్లకుంట గ్రామాల మధ్య గల మామిడితోటలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై గురువారం కోదాడ రూరల్ పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కోడు పుంజులు, నాలుగు కార్లు, రెండు ఆటోలు, నాలుగు ద్విచక్రవాహనాలు, రూ. 85,100 నగదు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నా రు.
మామిడితోటలో కోడి పందెలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపినట్లు సీఐ మొగలియ్య, ఎస్‌ఐ జి.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నిందితుల్లో కృష్ణాజిల్లా గన్నవరం, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు, ప్రకాశం జి ల్లాలకు చెందినవారు ఉన్నట్లు వివరించారు. నింది తులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరం తా రామాపురం క్రాస్ రోడ్డులోని పాత ఇనుము వ్యా పారం చేసే వ్యక్తి సహకారంతో ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్స్ బ్రహ్మం, రమేష్, సంజీవ్, శ్రీకాంత్, సత్యం పాల్గొన్నారు.
పందెంరాయుళ్ల అరెస్ట్
Published Fri, Mar 7 2014 2:28 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement