వైఎస్సార్ జిల్లా(ప్రొద్దుటూరు): నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు..అఖిల్ పాషా, మహబూబ్ పాషా అనే ఇద్దరు వ్యక్తులు గల్ఫ్ దేశాలకు పంపిస్తామని మాయమాటలు చెప్పి 36 మంది నిరుద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ఈ సంఘటన జరిగి చాలా రోజులై వీసాలు రాకపోవటంతో తాము మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు.
దీంతో అఖిల్ పాషా, మహబూబ్ పాషాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తరచుగా పాస్‌పోర్టు మోసాలకు పాల్పడుతూ వస్తున్న ఇద్దరిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దీంట్లో అఖిల్ పాషాని కీలక పాత్రధారిగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.